మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Rudra Stuti – శ్రీ రుద్ర స్తుతిః
నమో దేవాయ మహతే దేవదేవాయ శూలినే |
త్ర్యంబకాయ త్రినేత్రాయ యోగినాం పతయే నమః || 1 ||
నమోఽస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే |
శంభవే స్థాణవే నిత్యం శివాయ పరమాత్మనే || 2 ||
నమః సోమాయ రుద్రాయ మహాగ్రాసాయ హేతవే |
ప్రపద్యేహం విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారిణమ్ || 3 ||
మహాదేవం మహాయోగమీశానం త్వంబికాపతిమ్ |
యోగినాం యోగదాకారం యోగమాయాసమాహృతమ్ || 4 ||
యోగినాం గురుమాచార్యం యోగగమ్యం సనాతనమ్ |
సంసారతారణం రుద్రం బ్రహ్మాణం బ్రహ్మణోఽధిపమ్ || 5 ||
శాశ్వతం సర్వగం శాంతం బ్రహ్మాణం బ్రాహ్మణప్రియమ్ |
కపర్దినం కళామూర్తిమమూర్తిమమరేశ్వరమ్ || 6 ||
ఏకమూర్తిం మహామూర్తిం వేదవేద్యం సతాం గతిమ్ |
నీలకంఠం విశ్వమూర్తిం వ్యాపినం విశ్వరేతసమ్ || 7 ||
కాలాగ్నిం కాలదహనం కామినం కామనాశనమ్ |
నమామి గిరిశం దేవం చంద్రావయవభూషణమ్ || 8 ||
త్రిలోచనం లేలిహానమాదిత్యం పరమేష్ఠినమ్ |
ఉగ్రం పశుపతిం భీమం భాస్కరం తమసః పరమ్ || 9 ||
ఇతి శ్రీకూర్మపురాణే వ్యాసోక్త రుద్రస్తుతిః ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.